పర్మిషన్ లేకుండా భవన నిర్మాణం.. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నాఅధికారులు

    జిహెచ్ఎంసి శేర్లింగంపల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు


 హైదరాబాద్ సెప్టెంబర్ 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );పర్మిషన్ లేకుండా ఏడు అంతస్తుల భవన నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని  కడారి గంగారం ఆరోపించారు.ఈ మేరకు జిహెచ్ఎంసి శేర్లింగంపల్లి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మాదాపూర్ గుట్టల బేగంపేట జిహెచ్ఎంసి సర్కిల్ 20 కొండాపూర్ లో 300 గజాల  స్థలంలో ఏడంతస్తుల భవనాన్ని నిర్మాణం మా  ఇంటి పక్కన నిర్మాణం చేస్తున్నారని, అతని ద్వారా మాకు ఇబ్బంది కలుగుతుందన ఐ పేర్కొన్నారు. మా ఇంటి లోపల సిమెంటు అలాగే ఇటుకలు పడుతున్నాయి మేము ఎన్నిసార్లు చెప్పినా నాకు డిప్యూటీ కమిషనర్ సర్కిల్ 20 మాకు తెలుసు అని దబాస్తూ ఏవ్వరికి చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. తమరి  పేరు చెప్పి  మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే  తమరుఅతనిపై చంర్యాలు తెసుకోవాలని,పనులు ఆపివేయించి  మాకు ఇబ్బంది కలుగకుండా చూడాలని గంగా రాం విజ్ఞప్తి చేసారు.