సూరజ్ నగర్ కాలనీలో గనేశునికి ప్రత్యెక పూజలు నిర్వహించిన గుర్రాల వెంకటేశ్ యాదవ్




 మేడ్చల్ సెప్టెంబర్ 5 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );బోడుప్పల్ మునిసిపల్ పరిధి లోని 15 వార్డ్ లో గల సూరజ్ నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన గనేశునికి బోడుప్పల్ 24వ వార్డ్ మాజీ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేశ్ యాదవ్  ప్రతేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయనను సూరజ్ నగర్ వేల్ఫిర్ అసోషేషన్ సబ్యులు ఆయనకు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ  సూరజ్  కాలనీకి సిసి రోడ్డు రావడానికి ప్రధాన కారకుడు వెంకటేష్ అని  మన కాలనీ డ్రైనేజీ వ్యవస్థ కోసం పది లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.అంటే కాకుండా  సూరజ్ నగర్ పార్కు స్థలంలో వాటర్  ట్యాంకు కొరకు 55000 (అక్షరాల 55 వేల రూపాయలు) ఇచ్చినట్లు పేర్కొన్నారు.అనంతరం గుర్రాల రమా వెంకటేశ్ యాదవ్  మాట్లాడుతూ  సూరజ్ నగర్ కాలనీ అభివృద్ధి కోసం  ఎల్లవేళలా తన సహాయ సహాకారాలు ఉంటాయని తెలిపారు.