సంగారెడ్డి లోని ఇంటికి వచ్చి కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించిన దత్తాత్రేయ
సంగారెడ్డి సెప్టెంబర్ 5 ( ఆయుధం న్యూస్ );నూతన దంపతులు జయా - చైతన్య రెడ్డి లను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆశీర్వదించారు.శుక్రవారం సంగారెడ్డి లోని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గ రెడ్డి ఇంటికి వచ్చి కొత్త బట్టలు పెట్టి దత్తాత్రేయ ఆశీర్వదించేరు. ఈ సందర్బంగా ...తాను రాసిన 'ప్రజల కథే నా ఆత్మకథ ' పుస్తకాన్ని జగ్గారెడ్డికి దత్తాత్రేయ అందించారు.అలాగే ...అక్టోబర్ 3న హైదరాబాద్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి జగ్గారెడ్డిని ఆహ్వానించారు.ఈ సందర్బంగా దత్తాత్రేయ, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.దత్తాత్రేయతో తనకున్న అనుబంధాన్ని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు.... పార్టీలకతీతంగా మీరు ఏవిధంగానైతే మీరు సేవలు చేశారో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని నేను మీలాగే పార్టీలకతీతంగా సేవ చేస్తున్నానని జగ్గారెడ్డి..దత్తాత్రేయ కు తెలిపారు. ఆరోజుల్లో పనికోసం తన వద్దకు వచ్చే వారికి దత్తాత్రేయ చిట్టీ రాసిచ్చేవారనీ , పని పూర్తయిందా ? లేదా? అన్న విషయాన్ని సైతం వాకబు చేసేవారని జగ్గారెడ్డి గుర్తు చేశారు.... తానూ దత్తాత్రేయ నుండి కొన్ని విషయాలను నేర్చుకున్నాననీ ఆయన స్ఫూర్తి తో ప్రజా సేవ చేస్తున్నానని జగ్గారెడ్డి దత్తాత్రేయ కు వివరించారు....లాలాగూడ రామాలయంలో దత్తాత్రేయ సమక్షంలోనే తన పెళ్లి జరిగిందని జగ్గారెడ్డి గుర్తు చేశారు..... గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీరు పార్టీ కోసం ఎంతో పనిచేశారన్నారు.....మీకు నియోజకవర్గం లో ప్రోటోకాల్ ఉండాలని, సీఎం గా తన కోటాలో నా భార్య నిర్మల కు కార్పొరేషన్ చైర్మెన్ ఇస్తానని అన్నారు... ఈ పదవి సీఎం గా నా కోటాలో ఇస్తున్నానని, రాహుల్ గాంధీ గారి కి కూడా ఇదే విషయం చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని దత్తాత్రేయ కు జగ్గారెడ్డి.... వివరించారు. టీజిఐఐసి చైర్మెన్ ఇవ్వాలని తాను అడిగానని, అడిగిన విధంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చాడని జగ్గారెడ్డి దత్తాత్రేయ కు తెలిపారు.. ఆరోజుల్లో నలభై ఏళ్ల క్రితం దత్తాత్రేయ తో కలిసి పనిచేసిన పన్యాల ప్రభాకర్, బిహెచ్ఈఎల్ అంజయ్య, మిఠాయి నారాయణ, మిఠాయి వీరన్న, రెడ్డి పల్లి విఠల్ గౌడ్, బెస్త నర్సింగ్, తోపాజి అనంత్ కిషన్ తదితరుల జ్ఞాపకాల ను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు