హైదరాబాద్ జూలై 30 (ఎక్స్ ప్రెస్ న్యూస్ );హిందువులు సాంప్రదాయబద్ధంగా జరుపుకునే గొప్ప పర్వదినం రాఖీ పండుగ. దీనిని రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని కూడా పిలుస్తారు .ఈ సంవత్సరం ఆగస్టు 9వ తేదీ శనివారం ఈ పండుగ జరుపుకో నున్నారు . కుల , వర్గం ,ప్రాంతం అని గాని... పేద, మధ్య, సంపన్నులు అని కానీ ఈ పండుగకు భేదం లేదు. అందరూ సమానంగా ఈ పండుగ జరుపుకుంటారు. కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. అనుబంధాలు, బంధుత్వాలు మరింత బలపడతాయి. ఆరోజు ఎక్కడ చూసినా కోలాహలంగా కనిపిస్తుంది. రాఖీ అమ్మే దుకాణాలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వెలుస్తాయి. రాఖీ ల తయారీ కళాత్మకంగా ఉంటుంది. రక రకాల రంగులు, డిజైన్ల లో ఇవి ఆకర్షణీయంగా కనువిందు చేస్తాయి.పది రూపాయల నుండి వందలు, వేల రూపాయల వరకు వీటి ధరలు ఉంటున్నాయి.
మణికట్టు కు రాఖీ
సోదరీ సోదరుల మధ్య పవిత్ర అనుబంధానికి రాఖీ పండుగ ఒక సూచిక. చేతి మణి కట్టుకు రాఖీ కడతారు. మొదట నుదుట తిలకం దిద్దుతారు. స్వీట్లు తినిపించి తలపై అక్షింతలు చల్లి.. మా సోదరులను.. చల్లగా చూడాలని అంటూ ఆ దేవున్నీ ప్రార్థిస్తారు. ఈ సందర్భంగా బట్టలు, దుస్తులు ,డబ్బులు బహుమతులుగా ఇస్తుంటారు. అన్న అయితే చెల్లికి ...చెల్లి అయితే సోదరులకు ఆశీర్వాదాలు అందజేస్తారు ..అలాగే ఆశీర్వాదం కూడా తీసుకుంటారు .
రాఖీ కట్టేందుకు శుభసమయం
ఆగస్టు 9వ తేదీ శనివారం శ్రావణ పూర్ణిమ. ఆరోజు తెల్లవారు నుండి మధ్యాహ్నం వరకు రాఖీ కట్టేందుకు శుభ సమయం. ఈ సమయంలోనే రాఖీ కడితే అష్ట ఐశ్వర్యాలు... సుఖశాంతులు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. లేని పక్షంలో పురాణాల ప్రకారం... శుభ సమయంలో ద్రౌపది తన అన్న కృష్ణుడికి రాఖీ కట్టింది, అందుకే ఆపదలో ఆ భగవానుడు ఆమెను రక్షించాడు. అదేవిధంగా సూర్పనఖ తన అన్న అయిన రావణుడికి అశుభ సమయంలో రాఖీ కట్టిందని ...ఫలితంగా రావణుడు తన సామ్రాజ్యాన్ని, ప్రతిష్టను కోల్పోయాడని కూడా పండితులు వివరిస్తున్నారు.
వీటిని గిఫ్ట్ లుగా ఇవ్వరాదు
సమాజంలో సెంటిమెంట్లు ఎక్కువ. రాఖీ కట్టిన సోదరీమణులకు పర్ఫ్యూమ్ లు, గాజు వస్తువులు, గడియారాలు, పదునైన వస్తువులు ,నలుపు రంగు బట్టలు లేదా దుస్తులు ఇవ్వరాదని పెద్దలు చెబుతున్నారు. అదే విధంగా డబ్బులు కూడా ఇవ్వటం సమంజసం కాదంటున్నారు. కాగా చాలామంది మాత్రం అమ్మా... నీకు నచ్చిన దుస్తులు, వస్తువులు కొనుక్కోమని డబ్బులు ఇవ్వడం లేదా... వారే అడగటం కూ డా మనకు తెలిసిందే.
పూర్ణిమ తిథి
పూర్ణిమ తిథి ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున 02.12 గంటలకు ప్రారంభమై 9వ తేదీ మధ్యాహ్నం 1.24 గంటలకు ముగుస్తుందని పండితులు చెబుతున్నారు.
రాఖీ ఎన్ని రోజులు ధరించాలి

రక్షాబంధన్ నాడు ముందు దేవుడికి హారతి ఇచ్చి, ఆ తరవాత సోదరుడికి హారతి ఇచ్చి, సోదరుడి నుదుట కుంకుమ బొట్టు పెట్టాలి.అక్షింతలు శిరస్సు పై చల్లి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఆపై స్వీటు తినిపించి సోదరుడికి రాఖీ కట్టాలి.21 రోజులు లేదా జన్మాష్టమి వరకు మణికట్టు నుండి రాఖీని తొలగించవద్దు అని చెబుతుంటారు.చాలా సార్లు కొంతమంది రాఖీ కట్టిన వెంటనే కానీ ,కొన్ని గంటల తరువాత గానీ,వారి మణికట్టు నుండి రాఖీని తొలగించడం మంచిది కాదంటారు.పండితులు, శాస్త్రాలు, నమ్మకాల ప్రకారం సోదరుడు కనీసం 21 రోజులు లేదా జన్మాష్టమి వరకు తన మణికట్టు నుండి రాఖీని తొలగించకూడదు. అయితే ఇవన్నీ కూడా వారి వారి ఆచారాలు, సంప్రదాయాలను బట్టి ఆధారపడి ఉంటాయి. మొత్తం మీద ఈ పండుగ అనుబంధాలను, ఆత్మీయతలను మరింత పెంచుతుంది. ఉత్తమ మానవ విలువలను సుసంపన్నం చేస్తుంది.