తెగిపడిన విద్యుత్ వైర్లు ఎగిసిపడిన మంటలు

 తెగిపడిన విద్యుత్ వైర్లు ఎగిసిపడిన మంటలు
  వ్యవసాయ బోరు మోటార్లు, స్టార్టర్లు

తెగిపడిన విద్యుత్ వైర్లు ఎగిసిపడిన మంటలు

 దగ్ధమైన వ్యవసాయ బోరు మోటార్లు, స్టార్టర్లు




నవాబుపేట, మే 2  దొడ్డిపల్లి గ్రామంలో గురువారం రాత్రి వీచిన ఈదురు గాలులకు గ్రామస్థులు వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గంలో 11కెవి. విద్యుత్ వైర్లు తెగి ఎల్ టి లైన్ పై పడడంతో అగ్గి రాజుకుని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రాంతంలోని వ్యవసాయ బోరు బావులకు బిగించి ఉన్న బోరు మోటర్లు స్టార్టర్లు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఖాళీ బూడిదయ్యాయి. మంటలు ఎగసిప డుతున్నంతసేపు ఇప్పుడు ఏ ప్రమాదం చోటుచేసుకుంటుందోనని ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ప్రాణాలరచేత పెట్టుకోని బిక్కుబిక్కుమంటూగడిపారు. మంటలకు తోడుగా భారీ శబ్దాలు చేస్తూ వ్యవసాయ బోరు మోటార్లు, స్టార్టర్లు కాలిపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి తెగిపోయిన విద్యుత్ లైనుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు కాలిన బోరు మోటార్లకు నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

నవాబుపేట, మే 2 : దొడ్డిపల్లి గ్రామంలో గురువారం రాత్రి వీచిన ఈదురు గాలులకు గ్రామస్థులు వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గంలో 11కెవి. విద్యుత్ వైర్లు తెగి ఎల్ టి లైన్ పై పడడంతో అగ్గి రాజుకుని భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రాంతంలోని వ్యవసాయ బోరు బావులకు బిగించి ఉన్న బోరు మోటర్లు స్టార్టర్లు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఖాళీ బూడిదయ్యాయి. మంటలు ఎగసిప డుతున్నంతసేపు ఇప్పుడు ఏ ప్రమాదం చోటుచేసుకుంటుందోనని ఆ ప్రాంతంలో ఉన్న రైతులు ప్రాణాలరచేత పెట్టుకోని బిక్కుబిక్కుమంటూగడిపారు. మంటలకు తోడుగా భారీ శబ్దాలు చేస్తూ వ్యవసాయ బోరు మోటార్లు, స్టార్టర్లు కాలిపోవడంతో వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి తెగిపోయిన విద్యుత్ లైనుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడంతో పాటు కాలిన బోరు మోటార్లకు నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Post a Comment

Previous Post Next Post