వీక్లీ పరేడ్ తో పోలీసు సిబ్బందికి మానసిక రుగ్మతలు, శారీరక దారుడ్యం తొలగిపోవడం మెరుగుపడుతుంది జిల్లా ఎస్పీ రావుల గిరిధర్



జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ 


       యూనిఫాం వేసుకున్న ప్రతి ఒక్కరికి క్రమశిక్షణ చాలా ముఖ్యం


              హోంగార్డు నుండి ఉన్నతాధికారి వరకు అందరం ఒక కుటుంబ సభ్యులము, మన కుటుంబం పోలీసు కుటుంబం


        జిల్లాలో ఉన్న పోలీసు సిబ్బంది హోంగార్డు సిబ్బందికి పరేడ్ నిర్వహించి క్షేత్రస్థాయిలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ





వనపర్తి మే3 ఆయుధం న్యూస్ 

 

శనివారం రోజు జిల్లా ఎస్పీరావుల గిరిధర్ మేరకు జిల్లాబిపోలీసు సాయుధ దళ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, అప్పలనాయుడు గారి ఆద్వర్యంలో జిల్లా పోలీస్ కార్యాలయం పరేడ్ మైదానంలో అన్ని పోలీస్ స్టేషన్ల సిఐల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, జరిగింది. ఈ పరేడ్ కి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రావుల గిరిదర్ హాజరైన పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం సిబ్బంది పరేడ్ లో ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్రిల్, పరిశీలించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.   

ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ... వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి, ఫిజికల్ ఫిట్నెస్‌తో పాటు, సమయం దొరికినప్పుడు సిబ్బంది అధికారులు వ్యాయామం చేయడం చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విద్యుదుత్పత్తి మంచి అవకాశం ఉంటుంది. ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. ఇతర సమస్యలు ఏమున్నా పై ఆఫీసర్లకు చెప్పుకునే వీలుంటుందని. పోలీసులు మంచి జీవన విధానం అవలంబించాలన్నారు. క్రమశిక్షణతో డ్యూటీలను నిర్వహించాలని వనపర్తి జిల్లాకి, తెలంగాణ పోలీసుశాఖకి మంచి పేరు తీసుకురావాలన్నారు. సిబ్బందికి చేయవలసిన విధులు,చేయకూడని పనుల గురించి పలు సూచనలు చేయడం జరిగింది. ఏదైనా వ్యక్తి గత సమస్యలు ఉన్నాయి, డ్యూటీల వద్ద సమస్య ఉంది, ఆరోగ్య సమస్య ఉన్నవారికి దృష్టికి తీసుకురావాలి. రెగ్యులర్ గా హెల్త్ చెక్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రొఫైల్ తయారు చేయడం జరుగుతుంది

హోంగార్డు సిబ్బందికి విధి నిర్వహణలో కానీ వ్యక్తిగతంగా కానీ సమస్యలు ఉంటే వెంటనే తెలపాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి ముందుంటామన్నారు, యూనిఫాం సర్వీస్ డెలివరీలో అందరూ సమానమని అందరమూ ఒకే కుటుంబ సభ్యులకు సంబంధించిన వారిమని, క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.



ఈ కార్యక్రమంలోమెదక్ స్పెషల్ బ్రాంచ్ సీఐ, నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు,అప్పలనాయుడు, శ్రీనివాస్, సీఎస్ ఎస్సై, జయన్న ఏహెచ్ టీ వై ఎస్సై, అంజద్, రిజర్వ్ సబ్ స్పెక్టర్, వినోద్, శిక్షణ ఎస్సైలు, మరియు జిల్లా పోలీసు సిబ్బంది ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post