కష్ట కాలంలో మేమున్నామంటూ

   
   - మన సేవా సమితి ఆధ్వర్యంలో  శానిటైజర్లు, మాస్కులు పంపిణీ.  
     జడ్చర్ల (ఆయుధం న్యూస్)  లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు, కూలీలకు, వలసవాదులకు మన సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం  గౌరిశంకర్ లో మాస్కులు, శానిటైజర్లను మన సేవా సమితి గౌరవ అధ్యక్షులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బాదిమి రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా నిరుపేదలకు యువత ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాడానికి ప్రతిఒక్కరు ఇంట్లో ఉండి కరోనాను తరిమి కోట్టాలన్నారు. మాస్కులు ప్రతి ఓక్కరుదరించాలని తెలిపారు. కార్యక్రమంలో కాలనీవాసులు బలిజబాబు, కృష్ణ కుమార్ గౌడ్, గుర్రలశ్రీనివాసులు, అధ్యక్షులు వడ్లవేణు, ఉపాద్యాక్షులు రవింర్ రెడ్డి, ప్రదాన కార్యదర్శి ఎన్నంరాఘవేంధర్, కోశాధికారి రఘుమారెడ్డి, ప్రచార కార్యదర్శి చాకలియాదగిరి, కార్యదర్శి విజయ్ కుమార్, సలహదారులు  గోనేలరాధాకృష్ణ, సంతోష్, ఆర్ పీలు సరిత‌, స్వాతి, ఆశలు విజయలక్ష్మి, మాదవిలు పా ల్గొన్నారు.