తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరు - చంద్రబాబు

అమరావతి :మే 20 (ఆయుధం న్యూస్ ) ఏపీలో  తెదేపా గెలుపును ఎవరూ ఆపలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ నేతలతో చంద్రబాబు ఈ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో 18 నుంచి 20 ఎంపీ స్థానాలు పార్టీ గెలుస్తున్నట్లు వెల్లడించారు. 110 అసెంబ్లీ స్థానాలతో తమ గెలుపు ఖాయమని.. ఇది 120-130వరకూ వెళ్లొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు మైండ్ గేమ్స్‌తో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సులభంగా నిర్వహించాల్సిన ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వివాదం చేసిందని విమర్శించారు.